![]() |
![]() |
.webp)
గుప్పెడంత మనసు సీరియల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు సంపాదించుకుంది... అలాగే ఇందులో నటించేవాళ్లకు ఎంతో ఫ్యాన్ బేస్ కూడా పెరిగింది. మెయిన్ గా జగతి, రిషి, వసుధార, మహేంద్ర..ఈ సీరియల్ మొత్తాన్ని ఏలుతున్నవాళ్లు. ఇప్పుడు ఆ సీరియల్ టైమింగ్స్ మార్చేసరికి జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం మీద ఒక ఇంటర్వ్యూలో రిషి సర్ అలియాస్ ముఖేష్ రిషి స్పందించాడు. తన మీద ప్రేమ తగ్గలేదని...డిస్నీ హాట్ స్టార్ లో ఎప్పటిలాగే చూస్తున్నారని చెప్పారు. తనకు ఎన్నో మెసేజెస్, గిఫ్ట్స్ పంపిస్తారని కూడా చెప్పాడు. ఇక జగతి విషయం అడిగేసరికి ఆమెకు ఏది ఇష్టమో అదే చేస్తున్నారు. అందులో తప్పేమి లేదన్నారు. ఒక పర్సన్ ని హీరోయిన్ గా చూపించొచ్చు, మదర్ గా కూడా చూపించవచ్చు..ఎలా పోట్రె కావాలనుకుంటే అలా వాళ్ళు కనిపించవచ్చు అది వాళ్ళ ఛాయస్ అన్నాడు రిషి. గుప్పెడంత మనసు సీరియల్ లో మదర్ రోల్ లో నటించే జగతి మేడం చాలా ఎమోషనల్ గా చాల హుందాగా, ట్రెడిషనల్ గా కనిపిస్తారు. కానీ బయట అందుకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తారు. థైస్ షోతో , క్లీవేజ్ అందాలు ప్రదర్శిస్తూ ఆమె పోస్ట్ చేసే హాట్ ఫొటోస్ వైరల్ అవుతూ ఉంటాయి. ఇక సీరియల్ లో జగతి రిషి, ఎలా పోట్లాడుకుంటారో ఆఫ్ స్క్రీన్ లో కూడా అలాగే సరదాగా ఫైట్ చేసుకుంటారని చెప్పాడు. గుప్పెడంత మనసు సీరియల్ యూత్ ని బాగా అట్ట్రాక్ట్ చేస్తూ మంచి టిఆర్పిని సంపాదించుకుంది. కానీ ఇప్పుడు మాత్రం చాలా వెనకబడింది. లవ్ లో ట్విస్టులు, సెంటిమెంట్లు కొంచెం ఎక్కువయ్యాయి కూడా.
![]() |
![]() |